హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఏసీబీకి చిక్కిన లంచగొండి వీఆర్వో

AKP: కోటపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద వారాడ వీఆర్వో గిడుతూరి సూర్యనారాయణ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. 5 సెంట్ల భూమికి సంబంధించి 1బీ పత్రం ఇచ్చేందుకు ఆయన ఒక వ్యక్తి నుంచి రూ.20 వేల లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ వీఆర్వో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.