హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డీఈవో

TPT: నారాయణవనం మండలం పాలమంగళం జడ్పీ ఉన్నత పాఠశాలను డీఈవో కె.వి.ఎన్. కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యాబోధన, విద్యార్థుల హాజరును పరిశీలించారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆహారం రుచి, నాణ్యత, పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు.