హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

AKP: నర్సీపట్నం రోడ్డు-రేగుపాలెం రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రైలు పట్టాలు దాటుతుండగా సుమారు 50 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుడి ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో వివరాలు తెలియలేదు. నీలం రంగు గళ్ల లుంగీ, పింక్ షర్టుపై ఎరుపు-నలుపు గళ్ల ఫుల్‌హ్యాండ్స్‌ షర్ట్ ధరించి ఉన్నాడు.