ASR: మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని డీఎంహెచ్‌వో డా.రియాజ్ బేగ్ తెలిపారు. 41వ నేత్రదాన పక్షోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం పాడేరులో నేత్రదాన అవగాహన ర్యాలీ నిర్వహించారు. నేత్రదానంపై అపోహలు, మూఢనమ్మకాలను వీడి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డయాబెటిస్, బీపీ ఉన్నవారు కూడా నేత్రదానం చేయవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు'


