హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆకట్టుకుంటున్న వృక్ష గణపతి

తూ.గో: కడియం మండలం పొట్టిలంకకు చెందిన మురుగన్ నర్సరీ యువ రైతు దూలం ధనరాజు రెండేళ్ల శ్రమతో జీవం గల అరుదైన వృక్ష గణపతిని తీర్చిదిద్దారు. తొమ్మిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పుతో రూపొందిన ఈ ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇనుప తీగలతో గణపతి ఆకారాన్ని తయారు చేసి మాల్పీజియా తీగ జాతి మొక్కలను అల్లుతూ ఈ వినూత్న ప్రతిమను రూపొందించారు.