W.G: బాలికల భద్రత, రక్షణపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తణుకు పట్టణ సీఐ జె.వి.రమణ అన్నారు. తణుకు జడ్పీ బాలికల పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో బాలికలు ఎదుర్కొనే వివిధ రకాల ప్రమాదాలు, లైంగిక వేధింపులు, పోక్సో చట్టం, సైబర్ వేధింపులు, సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలపై జాగ్రత్తలు వహించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
బాలికల భద్రత, రక్షణ పై విద్యార్థులకు అవగాహన


