VSP: వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. ట్రాఫిక్, అత్యవసర వాహనాలకు ఆటంకం కలగరాదన్నారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి, ప్లాస్టిక్ వాడకం మాని పర్యావరణహితంగా ఉత్సవాలు జరుపుకోవాలని కోరారు. అలాగే అగ్నిమాపక, విద్యుత్ భద్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ముందస్తు అనుమతులు తప్పనిసరి'


