హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోనసీమకు రైలు రాక కోసం విద్యార్థుల నిరసన

కోనసీమ: అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో కోనసీమకు రైలు సౌకర్యం కల్పించాలంటూ విద్యార్థుల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. రైలు కనెక్టివిటీ లేకపోవడంతో విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. రైలు హామీ ఇచ్చి రెండున్నర దశాబ్దాలు గడిచినా అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.