హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖాళీ స్థలాలను హరిత వనాలుగా మార్చాలి: నాగబాబు

కాకినాడ: తొండంగి మండలం ఒంటిమామిడి గ్రామంలోని దివిస్‌ లేబొరేటరీస్‌ను ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఛైర్మన్‌ నాగబాబు మంగళవారం సందర్శించారు. పరిశ్రమలో గ్రీన్‌బెల్ట్‌, ప్లాంటేషన్‌ కార్యక్రమాలపై సమీక్షించారు. ఖాళీ స్థలాలను దశలవారీగా హరిత వనాలుగా మార్చాలని, స్థానిక వృక్ష జాతులతో మొక్కలు నాటి వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.