హైదరాబాద్: 28°C
తెలంగాణ

దాడుల రాజకీయాలు పెరిగాయి: కీర్తిరెడ్డి

 HYD: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రౌడీ రాజకీయాలు పెరిగాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కీర్తిరెడ్డి ఆరోపించారు. బంజారాహిల్స్‌లో నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ తల్లి శ్రీదేవిని పరామర్శించారు. ఇటీవల వర్షిత్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిలో ఆమె అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రీదేవి కోలుకుంటున్నారని పేర్కొన్నారు.