హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

నంద్యాల మండలం అయ్యలూరులో మంగళవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి పర్యటించారు. గ్రామంలో ఉన్న సచివాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. నూతన పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులను వారి సమస్యలను జిల్లా కలెక్టర్ రాజకుమారి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు కూర్చోవడానికి కుర్చీలు, తాగునీటిని అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు.