హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు

WNP: ఖరీఫ్ సీజన్‌లో 3.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు 450 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 15లోగా సిబ్బందికి శిక్షణ పూర్తి చేసి, అక్టోబర్ 1లోగా కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. ధాన్యం రవాణా చేసే అన్ని లారీలకు GPS తప్పనిసరి అని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.