హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే గృహనిర్బంధం

SDPT: ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్తున్న మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు రసమయి బాలకిషన్‌ను సిద్దిపేట టోల్‌గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి ఆధ్వర్యంలో ఆయన్ను సిద్దిపేటలోని నివాసానికి తరలించి గృహనిర్బంధం చేశారు. ఫామ్‌హౌస్ ముట్టడి పిలుపు నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.