KNR: శాతవాహన యూనివర్సిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రూ.10 లక్షలు కాజేసిన ఘరానా మోసాన్ని టూ టౌన్ పోలీసులు వెలుగులోకి తెచ్చారు. టౌన్ ACP వెంకటస్వామి వివరాల ప్రకారం.. సాలంపూర్ కు చెందిన మమత కుమార్తెకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని నకిలీ నియామక పత్రాలు ఇచ్చి విడతల వారీగా రూ.10 లక్షలు వసూలు చేశారు. ఈ మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తెలంగాణ
SUలో ఉద్యోగాల పేరిట రూ.10 లక్షల ఘరానా మోసం


