NLG: నిబంధనలను పాటిస్తూ శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలని నాంపల్లి సీఐ దూది రాజు అన్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన గణేష్ ఉత్సవ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గణేష్ విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా చూసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి'


