హైదరాబాద్: 28°C
తెలంగాణ

గన్‌పార్క్ వద్ద జనసేన నేతల అరెస్ట్

HYD: నగరంలోని గన్‌పార్క్ వద్ద శాంతియుత నిరసనకు సిద్ధమైన జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారని జనసేన వర్గాలు తెలిపాయి. వందలాది మందిని పోలీసు వాహనాల్లో తరలించినట్లు పేర్కొన్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. అరెస్టులను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు జనసేన పిలుపునిచ్చింది.