హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెలకుర్తి పోరాట మార్గం అందరికీ దిక్సూచి: CPM

MHBD: అమరజీవి, CPM సీనియర్ నాయకుడు కామ్రేడ్ నెలకుర్తి సీతారాం రెడ్డి ఆశయాలు, పోరాట మార్గం అందరికీ దిక్సూచిలాంటివని CPM రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గొల్లపల్లి నాగయ్య అన్నారు. మంగళవారం నెలకుర్తి నివాసంలో సీతారాంరెడ్డి మొదటి వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.