హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ'

WNP: జిల్లాలో సెప్టెంబర్ 14న వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రజలకు పిలుపునిచ్చారు. మట్టి విగ్రహాలు నీటిలో త్వరగా కరిగిపోవడంతో జల కాలుష్యం తగ్గుతుందని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలో 2,000 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.