NRML: భైంసా పట్టణంలోని ఏఎస్పీ క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ తెలిపారు. ప్రతి బుధవారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణిలో నేరుగా తెలియజేయాలని సూచించారు.
తెలంగాణ
భైంసాలో రేపు ప్రజావాణి కార్యక్రమం


