హైదరాబాద్: 28°C
తెలంగాణ

హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన సుదర్శన్ రావు

NRPT: ధన్వాడ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుదర్శన్ రావు హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆయనకు పదోన్నతి బ్యాడ్జీ అలంకరించి అభినందించారు. పదోన్నతితో బాధ్యతలు మరింత పెరుగుతాయని, ప్రజలకు మరింత బాధ్యతాయుతంగా సేవనందిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని ఎస్పీ సూచించారు.