NZB: గణేష్ మండపాల వద్ద డీజేలు, డీజే మిక్సర్లు, హైఫై సౌండ్ సిస్టమ్‌లకు అనుమతి లేదని భీమ్ గల్ ఎస్సై తిరుపతి తెలిపారు. మంగళవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ మండపాల నిర్వాహకులతో ఆయన సమావేశంను ఏర్పాటు చేసి మాట్లాడారు. లౌడ్‌స్పీకర్లను రాత్రి 10 గంటలకు తప్పనిసరిగా నిలిపివేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ
'గణేష్ మండపాల వద్ద ఢీజేలకు అనుమతి లేదు'


