హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వసతులను పరిశీలించిన అధికారి

కృష్ణా: గుడివాడ ఆర్టీసీ బస్టాండ్‌ను జిల్లా రవాణా అధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తనిఖీ చేశారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బస్టాండ్‌లో పారిశుద్ధ్య నిర్వహణ,ప్రయాణికులకు అందుతున్న వసతులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. బస్టాండ్‌లోని మరుగుదొడ్లు, ప్రయాణికుల వేచిచూసే ప్రాంగణం, తాగునీటి ట్యాంకులు, పరిసర ప్రాంతాలను పరిశీలించి తగు సూచనలు చేశారు.