HNK: ఎల్కతుర్తి మండలం సూరారంలో జాతీయ రహదారి నిర్మాణంతో రాకపోకలు నిలిచిపోయాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం గ్రామానికి వచ్చిన నేషనల్ హైవే అధికారులను సమస్యపై నిలదీశారు. లిఫ్ట్‌తో కూడిన ఫుట్‌ఓవర్ బ్రిడ్జి తమకు ఉపయోగకరం కాదని, వృద్ధులు, పిల్లలు, రైతులు, కూలీలు, పశువుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'ఫుట్‌ఓవర్ బ్రిడ్జి వద్దు.. అండర్‌పాస్ కావాలి'


