BHPL: మహాముత్తారం(M)లోని PHCకి రోజూ సుమారు 150 మంది రోగులు వస్తుండగా, ఒక్క వైద్యురాలే సేవలందించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కుల ప్రజా సంఘాల JAC BHPL జిల్లా ఛైర్మన్ కిరణ్ తెలిపారు. రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందన్నారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే మరో వైద్యుడిని నియమించాలన్నారు.
తెలంగాణ
వెంటనే మరో వైద్యుడిని నియమించాలి: కిరణ్


