హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి

MBNR: జడ్చర్ల మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేష్ డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గిరీష్‌ను కలిసి వారు వినతిపత్రం అందజేశారు. ఈపీఎఫ్ బకాయిలు, పెండింగ్ వేతనాలు చెల్లించాలని, సెలవులు, పనిముట్లు, రక్షణ పరికరాలు అందించాలని కోరారు.