MLG: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై BRS ఎమ్మెల్సీ తాత మధు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గోవిందరావుపేటలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో తాత మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్యాన్ని కించపరచడమేనన్నారు. రోడ్లపై ఆందోళనలు కాకుండా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు.
తెలంగాణ
గోవిందరావుపేటలో తాత మధు దిష్టిబొమ్మ దహనం


