హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోటీని సద్వినియోగం చేసుకోవాలి: కోట నాయక్

MBNR: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ క్విజ్ 2027'ను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన శాఖ అధికారి కోట నాయక్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని డీవైవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 15 -29 సం.ల వయస్సు గల యువత పోటీలో పాల్గొనేందుకు అర్హులన్నారు.