అన్నమయ్య: చిట్వేలు మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాజుగుంట మాజీ సర్పంచ్, గుత్తి నరసింహ కోరారు. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు జరుగుతున్న దరఖాస్తుల స్వీకరణను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది సహకారంతో దరఖాస్తుల ప్రక్రియ వేగంగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'అర్హులందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందాలి'


