హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యూట్యూబర్ జోసెఫ్‌కు రిమాండ్ పొడిగింపు

కృష్ణా: యూట్యూబర్ జోసెఫ్‌కు గన్నవరం కోర్టు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న జోసెఫ్ రిమాండ్ గడువు ముగియడంతో పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.