హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెళ్లైన 6 నెలలకే వైద్యురాలి మృతి

TPT: జిల్లాకి చెందిన ఆయుర్వేద వైద్యురాలు కీర్తి (28) హైదరాబాద్‌లో మృతి చెందారు. మార్చిలో తిరుపతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో ఆమెకు వివాహమైంది. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ నివాసం ఉంటున్నారు. సోమవారం ఆమె ఇంటికి వచ్చిన సహోద్యోగి, కీర్తి మృతి చెందిన స్థితిలో ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.