హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'భూములకు రక్షణ కల్పించాలి'

PPM: గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన డి-పట్టా భూములకు అటవీశాఖ అధికారుల నుంచి రక్షణ కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. కురుపాం తహసీల్దార్ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా ఉపాధ్యక్షుడు మన్నంగి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పెదగొత్తిలి పంచాయతీలో సుమారు 1,200 ఎకరాలను గిరిజనులు దశాబ్దాలుగా సాగు చేస్తున్నారని తెలిపారు.