PPM: జిల్లాలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు ఎప్పుడు తరలిస్తారని గిరిజన సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఏనుగుల తరలింపునకు శాస్త్రీయ పద్ధతులను అనుసరించి సరైన సమయంలో చర్యలు చేపట్టాలని కోరారు. ఏళ్ల తరబడి ఏనుగుల సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏనుగుల తరలింపు ఎప్పుడు?


