హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్‌లో ఘనంగా నేత్రదాన అవగాహన సదస్సు

KNR: నేత్రదానం మహాదానమని, అపోహలు వీడి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవం ముగింపు సందర్భంగా కరీంనగర్ వాసన్ ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు, అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. అనంతరం దాతల కుటుంబాలను సన్మానించారు.