హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి'

AKP: ప్రజల సమస్యలపై అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి సత్వర పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ఆదేశించారు. మునగపాక మండల పరిషత్తు సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గోదావరి జలాలు అందుబాటులోకి వస్తున్నందున నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. విద్యుత్, తాగునీటికి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.