హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రవి నాయక్

NGKL: చారకొండ మండలం అగ్రహారం తండాకు చెందిన నేనావత్ రవి నాయక్ సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం జాతీయ అధ్యక్షుడు కొర్ర మోతిలాల్ నాయక్ నియామక పత్రం అందజేశారు. బంజారా సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు నిరుపేదల అభివృద్ధికి కృషి చేస్తానని రవి నాయక్ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.