హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక విక్రయ కేంద్రాలను సందర్శించిన ఎస్సై

KMM: వినాయక విగ్రహాల తయారీ, విక్రయ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని భద్రతా, రక్షణ చర్యలు చేపట్టాలని కారేపల్లి ఎస్సై గోపి సూచించారు. నిర్వాహకులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విక్రయదారులను కోరారు.