ASR: డుంబ్రిగూడ మండలంలోని సొవ్వ పంచాయతీ కొరంజిగూడ ఎంపీపీ పాఠశాలలో రాబిన్‌హుడ్ ఆర్మీ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులకు మంగళవారం ఉచితంగా నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. అలాగే పేద కుటుంబాలకు బియ్యం, పప్పు దినుసులు తదితర నిత్యావసర సరుకులు అందజేశారు. సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్థానిక ఎంఈవో-2 గెన్ను అన్నారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజన విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ


