హైదరాబాద్: 28°C
తెలంగాణ

శంకర్‌పై చర్యలు తీసుకోవాలి: సబితా

RR: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి భాషనే శంకర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. 14 ఏళ్ల ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను అవమానించేందుకు మూడేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శంకర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.