హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎంవీఐ సస్పెండ్..!

NLR: ఏసీబీకి చిక్కిన ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎంవీఐ సస్పెండ్ అయ్యాడు. కావలి టోల్‌ప్లాజా వద్ద వాహనదారుల నుంచి డబ్బు వసూలు చేస్తూ ఏసీబీకి చిక్కిన ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎంవీఐ గోపినాయక్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఎంవీఐతో పాటు ఇద్దరు హోంగార్డులు చలమ్ కుమార్, నక్కా శ్రీనివాసులను విచారించి వారిని పోలీస్ శాఖకు బదిలీ చేశారు.