హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్యాంక్‌లోని మట్టి, మురుగు తొలగింపు

TPT: ఏర్పేడు మండలం చింతలపాలెం వెంకటపాలెంలో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్‌ను పంచాయతీ కార్యదర్శి ప్రసన్న ఆధ్వర్యంలో శుభ్రం చేశారు. ట్యాంక్‌లోని మట్టి, మురుగును తొలగించారు. ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. ట్యాంక్‌లను క్రమం తప్పకుండా శుభ్రం చేస్తే నీటి నాణ్యతతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చన్నారు.