హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి'

AKP: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సన్నద్ధం కావాలని పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకులు శోభా హైమావతి మంగళవారం పిలుపునిచ్చారు. పెందుర్తిలో నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు.