హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ

VZM: గుర్ల మండలంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు మంగళవారం పర్యటించారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న 8 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను వారి ఇళ్ల వద్దకే వెళ్లి స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.