హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి'

KRNL: జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే ఆలూరు కమిటీ ఖండించింది. మంగళవారం ఆలూరు తహసీల్దార్‌కు యూనియన్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఐ-న్యూస్‌ రిపోర్టర్లపై కేసులు, అరెస్టులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అరెస్టైన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేసి, పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు.