హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామ అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు '

KMR: బీబీపేట్‌లోని మాందాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు నేడు HYDలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆయనతో చర్చించారు. గ్రామంలో అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు.