కృష్ణా: బొప్పాయి తోటల్లో వైరస్ నిర్మూలన చర్యలు చేపట్టాలని ఉద్యానవన శాఖ అధికారి యన్.రమేష్ సూచించారు. మంగళవారం మోపిదేవి మండలంలోని కోసూరివారి పాలెం, నాగాయతిప్పల్లో బొప్పాయి తోటలను పరిశీలించారు. వైరస్ నియంత్రణకు లీటర్ నీటిలో ఎసిఫేట్ 1.5 గ్రాములు కలిపి పిచికారి చేయాలన్నారు. 10 రోజుల తర్వాత లీటరు నీటిలో ఇమిడా క్లోప్రిడ్ ఒక ఎంఎల్ కలిపి పిచికారి చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బొప్పాయి తోటల్లో వైరస్ నిర్మూలన చర్యలు చేపట్టాలి'


