హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైరవాణి తిప్ప ప్రాజెక్టును సందర్శించిన జాయింట్ కలెక్టర్

ATP: గుమ్మగట్ట మండలంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ విస్తృతంగా పర్యటించారు. మంగళవారం గుమ్మగట్ట మండలంలోని తాళ్లకెర గ్రామంలో 6వ దశ కింద చేపట్టిన రీసర్వే పనులను జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. రీసర్వే పనులను వేగవంతంగా చేపట్టాలని, గడువులోపు అన్ని పనులను పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.