హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకోజిపాలెంలో వ్యాపారుల ఆందోళన

VSP: వెంకోజిపాలెం నుంచి హనుమంతువాక జంక్షన్ వరకు తోపుడుబండ్లపై పండ్లు వ్యాపారం చేస్తున్న వారిని జీవీఎంసీ తొలగించడాన్ని నిరసిస్తూ వ్యాపారులు మంగళవారం ఆందోళన చేపట్టారు. 25 రోజులుగా వ్యాపారం నిలిపివేసి జోనల్ కమిషనర్ ఇబ్బంది పెడుతున్నారని వారు వాపోయారు. 25 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారం చేస్తున్నామని, ఖాళీ స్థలం ఉన్నా అమ్మకాలకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు.