హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కరువు మండలంగా ప్రకటించాలి'

SKLM: మందస మండలంలో వర్షాభావంతో నారుమడులు, నాట్లు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ రైతు సంఘం నాయకులు కే. మోహన్‌రావు, పొందర దేవేంద్ర కోరారు. సాగునీటి వసతులు కల్పించి, రుణమాఫీ, కొత్త రుణాలు, ఉచిత విత్తనాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.