హైదరాబాద్: 28°C
వార్తలు

త్రిషకు కంగనా రనౌత్ మద్దతు

రాజకీయ వివాదాల్లో మహిళల వ్యక్తిత్వాన్ని నిందించడం అలవాటుగా మారిందని ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. వేధింపులు, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఘటనల్లో ఎప్పుడూ మహిళలే లక్ష్యంగా మారుతున్నారని అన్నారు. 'తమిళనాడులో రెండు రాజకీయ పార్టీల వివాదంలోకి ఒక నటిని తీసుకొచ్చి.. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారు. మహిళలపై జరిగే ఈ రకమైన దాడులు ఎప్పుడు ఆగుతాయి' అని ఆమె ప్రశ్నించారు.