KDP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 913 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో కడప జిల్లాలో 38 పోస్టులు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ఆధ్వర్యంలో నియామకాలు చేపట్టనున్నారు. సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన 25–45 ఏళ్ల మహిళలు, పదో తరగతి అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఆంధ్రప్రదేశ్
కడప జిల్లాలో 38 ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీ


